Tuesday, October 22, 2024

Gujarat – ఇదో కొత్త ర‌కం మోసం – ఏకంగా న‌కిలీ కోర్టు సృష్టి

కేసులు విచార‌ణ‌.. తీర్పులు ఇచ్చిన జ‌డ్జి
డ‌బ్బులు ఎవ‌రు ఎక్కువిస్తే వారి వైపే తీర్పు
గుజ‌రాత్ ఫేక్ కోర్టు గుట్టు ర‌ట్టు

అహ్మ‌దాబాద్ – ఇప్పటి ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాం. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు వెలుగు చూసింది. వివ‌రాల‌లోకి వెళితే అహ్మ‌దాబాద్ కు చెందిన న్యాయ‌వాది మోరిస్ శామ్యూల్ క్రిస్టియ‌న్ ఏకంగా అహ్మదాబాద్ సివిల్ కోర్టు ముందు ఏకంగా న‌కిలీ కోర్టు ను ఏర్పాటు చేశాడు.. అంతే కాకుండా వివాదాల‌లో ఉన్న భూమ‌లపై త‌న కోర్టు విచార‌ణ జ‌రిపి తీర్పు ఇస్తుంద‌ని అత‌డు ప్ర‌క‌టించుకున్నాడు. దీంతో భూవివాదంలో ఉన్న చాలా మంది రియ‌ల్ట‌ర్ లు అతడి కోర్టు మెట్లెక్కారు..

ముందుగా క‌క్షిదారుల‌ను ఈ న‌కిలీ జ‌డ్జి పిలుపించుకుని , అన‌కూలంగా తీర్పు ఇవ్వాలంటే భారీగా ముట్ట‌చెప్పాల‌నే డిమాండ్ వారి ఉంచేవాడు.. దీంతో భారీగా స‌మ‌ర్పించుకుని త‌మ‌కు అనుకూలంగా తీర్పు పొందారు ప‌లువురు.. కోట్ల విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులో పలు ఉత్తర్వులు ఈ న‌కిలీ న్యాయ‌మూర్తి జారీ చేశారు. వీటిలో కొన్ని ఉత్తర్వులు డీఎం కార్యాలయానికి చేరాయి.

- Advertisement -

దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తికి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అహ్మదాబాద్‌ లోని భదర్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మోరిస్ క్రిస్టియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసును విచారించిన సిటీ కోర్టు నకిలీ కోర్టులో ఉంచిన కంప్యూటర్లు, సీపీయూలు, ఇతర పరికరాలను సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే మోరిస్ కు స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌ర్ని కూడా అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు సివిల్ కోర్టు న్యాయయూర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement