Saturday, November 23, 2024

గుజరాత్​ డ్రగ్స్​ కేసు.. మరో ముగ్గురు నిందితుల అరెస్టు

అరేబియా సముద్రంలో ఓ బోటు నుంచి రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఘటనలో ఇద్దరు అఫ్గాన్‌ పౌరులతో సహా మరో ముగ్గురిని గుజరాత్‌ ఏటీఎస్‌, ఇండియన్‌ కోస్ట్ గార్డులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 9 మంది పాకిస్థానీ పౌరులను ఇంతకుముందు అదుపులోకి తీసుకున్నట్టు గుజరాత్​ ఏటీఎస్​ పోలీసులు తెలిపారు.

గుజరాత్ ATS, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఏప్రిల్ 25న అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఒక పడవను పట్టుకున్నారు. నిందితుల నుండి 56 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్​ అధికారులు  తెలిపారు. కాగా, ఆ ఘటనలోని నిందితుల్లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఖారీ హమీదుల్లా, మహ్మద్ హకీమ్, అజీమ్ అహ్మద్‌గా గుర్తించారు. వీరు న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.

 “ATS, మరియు కోస్ట్ గార్డ్ బృందం అందుకున్న సమాచారం ఆధారంగా భారత జలాల్లో 14 NM ఉన్న పాకిస్తాన్ బోట్ అల్ హజ్‌లో నిఘాపెట్టాం. మేము 56 కిలోల బరువున్న 56 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాము. దాని విలువ 280 కోట్లు ఉంటుందని ATS ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. నిందితులను కోర్టు రిమాండ్ తర్వాత విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement