టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి సిల్వర్ మెడల్ గెలిచిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయానికి బహుమానంగా భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన కింద రూ.3 కోట్లు భవీనా పటేల్‌కు నజరానాగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలోని వాడ్‌నగర్ భవీనా స్వస్థలం. ఆమె 12 నెలల వయసులోనే పోలియో బారిన పడింది. అయినా ఏమాత్రం కుంగిపోకుండా గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటివరకు పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన భవీనా.. ఐదు గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్ సాధించింది. అంతేగాక, ఇప్పుడు తాను ఆడిన తొలి పారాలింపిక్స్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి వెండి పతకం సొంతం చేసుకుంది.
ఈ వార్త కూడా చదవండి: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు సిల్వర్ మెడల్