Wednesday, December 4, 2024

Gujarat – కెమికల్ రియాక్ట‌ర్ పేలుడు – న‌లుగురు దుర్మర‌ణం

గాంధీన‌గ‌ర్ – గుజ‌రాత్ లోని బ‌రూచ్ లోని ఒక ఫ్యాక్ట‌రీలో నేడు రియాక్ట‌ర్ లో భారీ పేలుడు సంబవించింది. ఈ పేలుడు న‌లుగురు కార్మికులు మ‌ర‌ణించారు.. మ‌రికొంత మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. డిటాక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ లో ఈ ఘటన జరిగింది. సంఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. దీనిపై మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement