Tuesday, November 19, 2024

Guinness World Record – ఇదీ ఒక రికార్డే….మూడు సెక‌న్ల‌లో కాఫీ గుట‌కాయ‌స్వాహా…

ప్రపంచంలో చాలామంది కాఫీని ఇష్టపడతారు. కమ్మటి కాఫీ వాసన చూడగానే శరీరం మొత్తం యాక్టివ్‌ అయిపోతుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే కప్పు కాఫీ కడుపులో పడాల్సిందే..లేదంటే బెడ్‌ కూడా దిగరు.. కాఫీ రుచిని ఆస్వాదిస్తూ నెమ్మ‌దిగా తాగుతుంటారు. కొందరు షాస్ట్‌గా తాగేస్తుంటారు.. అయితే ఎంత ఇష్టపడినా సెకన్ల వ్యవధిలో మెరుపు వేగంతో తాగలేరు. అయితే ఒక వ్యక్తి మెరుపు వేగంతో ఒక కప్పు కాఫీ తాగి రికార్డ్ సృష్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రపంచంలోని ఎన్నో రికార్డులను మీరు చూసి ఉంటారు. కానీ ఓ కుర్రాడు చేసిన రికార్డు మాత్రం అద్భుతం. జనం సులువుగా ఎంజాయ్ చేసే కాఫీని రెప్పపాటులో తాగేశాడు ఆ కుర్రాడు. అతను కేవలం 3 సెకన్లలో ఈ కప్పు కాఫీ తాగడం పూర్తి చేశాడు. ఇతని పేరు ఫెలిక్స్ వాన్ మెయిబోమ్. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నివాసి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఫెలిక్స్ మెరుపు వేగంతో ఒక కప్పు కాఫీ తాగి రికార్డ్ సృష్టించాడు. అత‌డి పేరును గిన్నీస్ బుక్ లోకి ఎక్కించేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement