మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగరాలు, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికా బద్ధంగా ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పథకం కింద ప్లాట్ పొందడానికి 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్లు అన్నీ ఒకే విధంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఔట్లను ప్రభుత్వం లబ్ధిదారులను సరసమైన ధరలకు అందించనుంది.
★ అర్హతలు: ఒక కుటుంబానికి ఒకే ప్లాట్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షికాదాయం రూ.18లక్షల లోపు ఉండాలి. 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తుండాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగిఉండాలి.
★ దరఖాస్తు: డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) రూపొందించిన వెబ్‌సైట్ లేదా వార్డు సచివాలయాల్లో సమర్పించవచ్చు.
★ ఎంపిక: లాటరీ విధానంలో ప్లాట్ కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.
ఈ వార్త కూడా చదవండి: దానం నాగేందర్‌కు ఊరట.. జైలు శిక్ష నిలిపివేత