Monday, November 18, 2024

అతిథి మర్యాదలు చేసే రోబో.. కేవ‌లం రూ.2వేలే..

కోల్ క‌తా – ఇంట్లోని పనికిరాని వస్తువులతో ఓ రోబో​ను తయారుచేశాడు బంగాల్​కు చెందిన దేబాశిష్ దత్తా అనే యువకుడు. ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసిపెట్టేలా ఆ మరమనిషిని తీర్చిదిద్దాడు. దేబాశిష్​ దత్తా సిలిగురిలోని బాగ్డోగ్రా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని పాలిటెక్నిక్​ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న దేబాశిష్​కు రోబోలంటే చాలా ఇష్టం. వాటిని తయారుచేయాలని కలల కనేవాడు. కానీ, వాటిని తయారు చేసేంత ఆర్థిక స్తోమత లేదు. అయినా పట్టువిడవకుండా ఇంట్లో పనికిరాని వస్తువులతో రెండు నెలలు శ్రమించి ఓ రోబోను తయారుచేశాడు. సీ-ప్రోగ్రామింగ్​ సహాయంతో కోడింగ్ చేశాడు. రోబోకు ‘బిధు శేఖర్’​ అని పేరు పెట్టాడు. ఆ మరమనిషిని తయారు చేయడానికి 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పాడు దేబాశిష్​. అవార్డు ఫంక్షన్లలో పురస్కారాలు సైతం ఇది ప్రదానం చేస్తుందని అతడు చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement