న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వివిధ కార్పొరేషన్లు , ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 2014 –2022 మధ్యకాలంలో రూ.1,67,308.07 కోట్ల అప్పులకు తెలంగాణ ప్రభుత్వం పూచీకత్తులు సమర్పించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుల కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన పూచీకత్తులపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2014–15లో రూ. 100 కోట్లు, 2015–16లో రూ.1,830కోట్ల పూచీకత్తు, 2016–17 రూ. 24,820.61 కోట్లు, 2017–18 రూ. 22,689.70, 2018–19 రూ. 1,927.92 కోట్ల పూచీకత్తు, 2019–20వ సంవత్సరంలో రూ.22,020.91 కోట్లు, 2020–21లో రూ.48,294.18 కోట్లు, 2021-22లో రూ. 35,624.75 కోట్లు పూచీకత్తుగా సమర్పించారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.