ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (బుధవారం) గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ :
పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
గుజరాత్ టైటాన్స్ :
వృద్ధిమాన్ సాహా (wk), శుభమాన్ గిల్ (c ), బి సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్.
అయితే, వరుస ఓటములతో సతమతమవుతున్న డిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ… ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.