Thursday, November 21, 2024

GT vs CSK | ఓపెనర్ల విధ్వసం… సీఎస్‌కే ముందు భారీ టార్గెట్

అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రుగుత‌న్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు విధ్వంసం సృష్టించారు. సీఎస్‌కే బౌలర్లను ఉతికారేస్తూ… 17 ఓవర్లవరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పరుగుల వరద పారించారు. మొత్తానికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్… నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగులు బాదింది.

ఓపెనర్ సాయి సుద‌ర్శ‌న్ ( 51 బంతుల్లో 103), కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్( 55 బంతుల్లో104)లు ఆదినుంచే దూకుడుగా ఆడుతూ గుజరాత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. బౌండరీలతో చెలరేగి చెరో సెంచరీతో విరుచుకుపడ్డారు. దీంతో అత్యధిక ఓపెనింగ్ పార్నర్ షిప్ 210* రికార్డును నెలకొల్పారు. ఇదికవరకు కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్‌ల పేరుమీదున్న రికార్డును వీరిద్దరూ సమం చేశారు. అయితే గుజరాత్ ఓపెనర్ల దూకుడును 18వ ఓవర్లో దేశ్‌పాండే అడ్డుకున్నాడు. ఒక్కే ఓవర్‌‌లో ఇద్దిరినీ పెవిలియన్ చేర్చి సీఎస్‌కుకు కాస్త ఊపిరినందించాడు.

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన సాయి సుదర్శన్…

ఈ సీజన్ లో ఒక్కే జట్టునుంచి ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇదే తొలి సారి. కాగా, ఓపెనర్ సాయిసుదర్శన్ ఈ మ్యాచ్‌తో 1000 ఐపీఎల్ రన్స్ పూర్తి చేశాడు. అయితే, తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన రికార్డును నెలకొల్పాడు.

1000 ఐపీఎల్ రన్స్..

- Advertisement -

సాయి సుదర్శన్ 25
సచిన్ 31
రుతురాజ్ 31
తిలక్ వర్మ 33

Advertisement

తాజా వార్తలు

Advertisement