ప్రభన్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపేందుకు పోటీపడుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల సామాన్య ప్రజల జీవప్రమాణాలు సన్నగిల్లడంతో పాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రతి మనిషి జీవించడానికి తిండి, దుస్తులు, ఇల్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంతో కొత్త సంవత్సరం (జనవరి 1, 2022) నుంచి దుస్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. వస్త్ర వ్యాపారాన్ని కరోనా కకావికలం చేసింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తరుణంలో పన్ను పెంపు మరింత కుదేలయ్యేలా ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం కలంకారీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనున్నది. దీంతో ఈ పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital