న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని సోమవారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్లమెంట్‌లో ప్రస్తావించారు.
ఎంపీ బాలశౌరి ప్రశ్నలపై స్పందించిన నిర్మలా సీతారామన్ ఏపీకి కేంద్రం విడుదల చేయాల్సిన రూ. 1,268 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్‌లో వున్నాయని బదులిచ్చారు. 2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేశామని ఆమె ప్రకటించారు.