Monday, November 25, 2024

డిసెంబర్‌ 17న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై చర్చ

డిసెంబర్‌ 17న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఇది 48వ కౌన్సిల్‌ సమావేశం. 47వ సమావేశం చండీఘడ్‌లో జూన్‌ లో జరిగింది. ఈ సారి సమావేశం ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌గా జరగనుంది. గత జీఎస్టీ సమావేశంలో కొన్నింటిపై రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సమావేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌, కాసినోపై 28 శాతం జీఎస్టీ విధించే అంశంపై చర్చించనుంది. ఇప్పటికే దీనిపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఆన్‌లైన్‌ గేమింగ్‌, కాసినో పై 28శాతం జీఎస్టీ విధించాలని తన నివేదికలో కోరింది.

గతంలోనూ ఈ కమిటీ ఇదే సిఫార్సు చేసినప్పటికీ 47వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. గత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఎన్‌ఈడీ బల్బులు, సోలార్‌ వాటర్‌ హీటర్స్‌, మెటల్‌ ప్రిండెట్‌ సర్క్యూట్‌ బోర్డులపై 12 శాతం జీ ఎస్టీని 18 శాతానికి పెంచారు. మజ్జిగ, ప్యాకేజీడ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌పై కూడా జీఎస్టీ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement