దేశంలో జీఎస్టీ వసూళ్లు డిసెంబర్‌లో 15 శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 1,49,507 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇందులో సీజీఎస్టీ 26,711 కోట్లు, ఎస్‌జీఎస్టీ 33,357 కోట్లు , ఐజీఎస్టీ 78,434 కోట్లు వచ్చింది. ఇందులో దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 40,263 కోట్లు కలిసి ఉన్నాయి. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 1.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెస్ రూపంలో డిసెంబర్‌లో 11,005 కోట్లుగా ఉన్నాయి.
ప్రభుత్వం 36,669 కోట్లు సీజీఎస్టీ, 31,094 కోట్ల ఎస్‌జీఎస్టీ సర్దుబాటు చేసింది. దీని తరువాత మొత్తం కేంద్ర, రాష్ట్రాల మధ్య సెటిల్‌మెంట్‌లో సీజీఎస్టీ 63,380 కోట్లు, ఎస్‌జీఎస్టీ 64,451 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌లో దిగుమతి అయిన గూడ్స్ నుంచి వచ్చిన ఆదాయం, దేశీయ లావాదేవీల కంటే 8 శాతం పెరిగిందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.