హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో విద్యార్థులకు అవసరమైన వస్తువులపై భారాలు వేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. విద్యార్థులు వాడే పెన్సీళ్లు, ఇంకు, షార్ప్‌నర్, రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్‌పై 12 శాతం జీఎస్టీ విధించిందన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్ బుక్స్, చార్ట్, మ్యాప్ పేపర్లు, గ్రాఫ్ పేపర్లు, ఎక్ససైజ్ బుక్స్‌పైన 18 శాతం జీఎస్టీ విధించి విద్యార్థుల చదువులు మరింత భారంగా మోపుతున్నారని విమర్శించారు.
దేశంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా విద్యార్థులు చదువుకునే చదువులపై భారాలు పెంచడమేంటని ప్రశ్నించింది. పేదలందరికీ చేరువ చేయాల్సిన విద్యను ఈ విధంగా భారం పెంచి నూతన విద్యావిధానం పేరుతో విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. భారీగా విధించిన ట్యాక్స్ శాతాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.