Friday, November 22, 2024

Delhi | అత్యుత్తమ శిక్షణ సంస్థగా హైదరాబాద్‌ జీఎస్ఐటీఐ.. ర్యాంక్ ప్రకటించిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైరదాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (GSITI) ‘అతి ఉత్తమ్’ గ్రేడ్ దక్కించుకుంది. గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఎర్త్ సైన్స్ శిక్షణలో వివిధ స్థాయిలలో ఇన్‌స్టిట్యూట్ అనుసరించిన అన్ని ప్రమాణాలను, పద్దతులను తనిఖీ చేసిన అనంతరం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NABET) గుర్తింపునిచ్చింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మరియు క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సంస్థల నుంచి వచ్చిన బృందం ఆన్-సైట్ అసెస్‌మెంట్ నిర్వహించి, ‘అతి ఉత్తమ్’ గ్రేడింగ్‌తో అక్రిడిటేషన్ సర్టిఫికేట్‌ను ప్రదానం చేసింది.

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 1976లో ఏర్పాటైన ఈ సంస్థకు హైదరాబాద్, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, కోల్‌కతా మరియు షిల్లాంగ్‌లలో ఆరు ప్రాంతీయ శిక్షణా విభాగాలున్నాయి. చిత్రదుర్గ (కర్ణాటక), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), జవార్ (రాజస్థాన్) మరియు కుజు (జార్ఖండ్)లలో కూడా నాలుగు క్షేత్ర శిక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జియోసైన్స్ నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులకు భూగర్భ శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాల్లో శిక్షణ అందించడానికి గనుల మంత్రిత్వ శాఖ అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

- Advertisement -

ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (ఎంఈసీఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎండీసీ), జాతీయ విద్యాసంస్థలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు) సహా సంబంధిత రంగాలవారికి శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కోర్సులను అందజేస్తున్నారు. అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) స్పాన్సర్ చేసిన ఎన్‌ఎన్‌ఆర్‌ఎంఎస్ ప్రోగ్రామ్ కింద రిమోట్ సెన్సింగ్‌పై కూడా ఈ సంస్థ క్రమం తప్పకుండా కోర్సులను నిర్వహిస్తుంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తున్న ఐటీఈసీ కార్యక్రమం కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారికి కూడా ఇక్కడ శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే 75 దేశాలకు చెందిన నిపుణులు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందారు. తద్వారా ఈ సంస్థ అంతర్జాతీయంగానూ ఖ్యాతి గడించింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంతో పాటు ప్రాంతీయ, క్షేత్రస్థాయి శిక్షణ కేంద్రాల ద్వారా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలపై కూడా కోర్సులు అందజేస్తోంది.

హిమాలయాలతో సహా వివిధ భూభాగాల మ్యాపింగ్ టెక్నిక్‌లలో డొమైన్ సామర్థ్యాలను మెరుగుపర్చడానికి శిక్షణా కోర్సులు అందిస్తున్నారు, మినరలైజ్డ్ జోన్‌లను (గోల్డ్, డైమండ్, కాపర్, లిథియం, REE, ఐరన్, మాంగనీస్ మొదలైనవి), ఫోటో-జియాలజీ మరియు రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ అన్వేషణ పద్ధతుల సమాచార వ్యవస్థ, పెట్రోలజీ, జియోక్రోనాలజీ, జియోఫిజిక్స్, కెమిస్ట్రీలో విశ్లేషణాత్మక పద్ధతులు, పర్యావరణ మరియు పట్టణ భూగర్భ శాస్త్రం, సహజ ప్రమాదాలను వంటివి ఇందులో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగుల యొక్క క్రియాత్మక సామర్థ్యాల అప్-గ్రేడేషన్ కోసం కూడా కోర్సులను అందజేస్తోంది. అధికారుల పనితీరు, సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement