Tuesday, November 19, 2024

GSAT 20 సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 ప్రయోగం సక్సెస్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. స్పేస్‌ఎక్స్‌ కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ జీశాట్‌-20ను నింగిలోకి నేడు విజయవంతంగా మోసుకెళ్లింది.

అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌, ఎండీ రాధాకృష్ణణ్‌ దురరురాజ్‌ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన.. జీశాట్‌-20 కచ్చితమైన కక్ష్యలోకి చేరింది అని వెల్లడించారు.

34 నిముషాలపాటు ప్రయాణం అనంతరం కక్షలోకి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశ పెట్టింది.. .. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంది.. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది.

జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది.

- Advertisement -

జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ ప్రయోగానికి వినియోగించిన 549 టన్నులుండే ఫాల్కన్‌ 9 బీ-5 రాకెట్‌లో రెండు దశల్లో పనిచేస్తుంది. ప్రయోగ వాహనం కక్ష్య వేగాన్ని అందుకోడానికి దాని రెండు విభిన్న దశలు వరుసగా ప్రొపల్షన్‌ను అందిస్తాయి. ఈ రాకెట్‌ 8,300 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ కక్ష్యకు, 22,800 కిలోల శాటిలైట్స్‌ను భూమి దిగువ కక్ష్యకు చేర్చగలదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement