Wednesday, November 20, 2024

TS | గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా.. మళ్లీ పరీక్షలు నిర్వహించేది అప్పుడే..!

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగనుంది. పోలీసులు, ఇతర సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల నేపథ్యంలో ప‌రీక్ష‌లు నిర్వహించడం కష్టమని భావించిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది.

వాయిదా పడిన పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా పడింది.పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, పరీక్షలకు 1600 కేంద్రాలు అవసరమవుతాయని, దాదాపు 25 వేల మంది పోలీసులు, 20 వేల మందికి పైగా ఇతర సిబ్బంది పరీక్షలకు అవసరమవుతుందని TSPSP విశ్వసిస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్నికలకు, మరోవైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం కష్టంగా మార‌నుండ‌గా.. పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది టీఎస్ పీఎస్పీ.

ఇదిలా ఉండగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది డిసెంబర్‌లో 783 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 నుండి ప్రారంభమైంది. దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement