హైదరాబాద్: విపక్షాల ట్రాప్లో పడొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రూపు 1 అభ్యర్థులను కోరారు.. జీవో నెం 29పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జీవో నెం 29తో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని క్లారిటీ ఇచ్చారు.
గాంధీ భవన్లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, ఎందరో నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే జీవో నెం 29 తీసుకువచ్చామని తెలిపారు. . జీవో నెం 29తో విద్యార్థులకు నష్టం లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు.
గ్రూప్-1 విషయంలో అనవసర రాద్ధాంతం అని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం విపక్షాల నేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయని సీరియస్ అయ్యారు.
- Advertisement -