Wednesday, October 9, 2024

TGPSC | గ్రూప్‌-1 మెయిన్స్ హాల్ టికెట్స్ రెడీ !

హైద‌రాబాద్ : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

అభ్యర్థులంతా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష జరుగనున్నది.

పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నట్లు పేర్కొంది. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

3.02లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.

పరీక్షలు ఇలా..

  • 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ )
  • 22న పేపర్-1 (జనరల్ ఎస్‌ఏ)
  • 23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
  • 24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
  • 25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్)
  • 26న పేపర్- 5 (సైన్స్ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్
  • 27న పేపర్‌-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)
Advertisement

తాజా వార్తలు

Advertisement