ఎవరైనా పెళ్లి అంటే సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. కానీ ఇండోనేషియాలోని ఓ వ్యక్తి నిక్కర్‌తోనే పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సుప్రప్తో అనే వ్యక్తి పెళ్లికి నాలుగు రోజుల ముందు బైక్‌పై బయటకు వెళ్లాడు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు అతడి శరీరంలోని పలు భాగాలకు బ్యాండేజ్ వేయడంతో పాటు చేతికి కట్టు కట్టారు. అంతేకాదు సర్జరీ కూడా జరిగింది. దీంతో బట్టలు ధరించడానికి అతడి బాడీ సహకరించదని పేర్కొన్నారు. దీంతో చేసేదేంలేక ఆ వరుడు చెడ్డీపైనే పెళ్లికి హాజరయ్యాడు. ఇండోనేషియా, తూర్పు జావా ప్రావిన్స్‌లోని ఎంగంజుక్‌లో వధువు ఇంటి వద్ద ఈ వివాహం జరిగింది. పెళ్లితో పాటు ఆ తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లోనూ వరుడు సంప్రదాయ వస్త్రాల్లో కాకుండా షార్ట్‌పైనే కనిపించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ‘ఇకపై నువ్వు ఒంటరిగా బయటకు వెళ్లలేవు, భార్య తోడుగా ఉంటుంది, ద షో మస్ట్ గో ఆన్’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.