Tuesday, November 26, 2024

పెళ్లి కూతురు కాళ్ల‌కి మొక్కిన పెళ్లికొడుకు- ఈ వీడియోకి 5ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్

పెళ్లి వేడుక‌లో తాళి క‌ట్టిన త‌ర్వాత వ‌రుడి కాళ్ల‌కి మొక్క‌డం సంప్ర‌దాయం. అయితే ఇక్క‌డ ఓ వ‌రుడు పెళ్లికూతురి కాళ్ల‌కి మొక్కిన వీడియో వైర‌ల్ గా మారింది. నెటిజన్లు.. ఈ వీడియోకి ఫిదా అయిపోతున్నారు.తాజాగా ఓ యువతి ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. అందులో.. వరుడు పెళ్లి తంతు ముగియగానే… తన భార్య కాళ్లు తాకాడు. మామూలుగా అయితే.. వధువు.. వరుడి పాదాలను తాకాలి. ఆ పెళ్లి చేసిన పంతులు కూడా అదే చెప్పాడట. కానీ.. వరుడు మాత్రం ప్రేమగా.. తన భార్య కాళ్లను తాకాడు. ఆ తర్వాత ఆమెను హత్తుకున్నాడు.

ఈ వీడియోని సదరు పెళ్లి కూతురే షేర్ చేయడం గమనార్హం. తన భర్త చేసిన విషయం అక్కడ పంతులకు అస్సలు నచ్చలేదట. అయితే.. తర్వాత.. మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలు అంటూ సదరు పంతులు వధువు చెవిలో చెప్పాడట. ఆ విషయాన్ని కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వధువుని.. అదృష్టవంతురాలు అని.. వరుడు ఎంత మంచి వాడంటూ.. కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఈ వీడియోకి ఇప్పటికే 5లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement