తాజా ఉత్పత్తుల సప్లయి చైన్ కంపెనీ.. నింజాకార్ట్, ఫ్లిప్ కార్ట్లు యూఎస్ ఆధారిత మాతృ సంస్థ వాల్మార్ట్ ఇంక్ నుంచి 145 మిలియన్ డాలర్లను సేకరించింది. భారతదేశ అగ్రిటెక్ రంగంలో అతిపెద్ద డీల్ అని భారతీయ ఈ-కామర్స్ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు నింజాకార్ట్లో ఫ్లిప్కార్ట్ మూడు సార్లు పెట్టుబడులు పెట్టింది. ఫ్లిప్కార్ట్.. తన 90 నిమిషాల ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని.. ఫ్లిప్కార్ట్ క్విక్ 2022 చివరి నాటికి 200 నగరాలకు విస్తరింపజేస్తున్న సమయంలో ఈ డీల్ వచ్చింది.
ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ పెట్టుబడితో.. తాజా కేటగిరీలో నాణ్యమైన, సరసమైన ధరలకు కిరాణా సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ-గ్రోసరీకి ఎంతో డిమాండ్ పెరిగిందని తెలిపారు. తమ కిరాణా వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు వివరించారు. ఈ నిధులు నింజాకార్ట్ పారదర్శకమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని సహ వ్యవస్థాపకుడు తిరుకుమారన్ నాగరాజన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital