కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలం అయిందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో 65 లక్షలతో డి87న కెనాల్ నుండి రాజసముద్రం చెరువు నింపడానికి నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్మాణ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ .. మిషన్ కాకతీయతో చెరువులన్నీ పునరుద్దరణ జరిగిందని.. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని వెల్లడించారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు నీటి యుద్ధాలు జరిగేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీడు భూములను సాగులోకి వచ్చాయని అన్నారు. కాలేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోసారని అన్నారు. కాలేశ్వరం మొదటి ఫలితం కరీంనగర్ కి దక్కడం అదృష్టం అన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు మానేరు వాగుపై 5 ఇరుకుల్ల వాగుపై 4 చెక్ డ్యామ్ లు నిర్మించామని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో చెరువులన్నీ నింపుకున్నామని, తెలంగాణ అభివృద్ధి చూసి పెద్దపెద్ద కంపెనీలన్ని హైదరాబాదుకు తరలివస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఢిల్లీ ఆంధ్ర పాలకులు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వనరులను దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజలదే అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య జడ్పిటిసి పురమల్ల లలిత- శ్రీనివాస్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ ఐలయ్య, జక్కం నర్సయ్య, మడికంటి మారుతీ,జువ్వా డి రాజేశ్వర్ రావు, పంది తిరుపతి యాదవ్, కూర నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement