Friday, November 22, 2024

బీహార్ కు రూ.4వేల కోట్లు జ‌రిమానా విధించిన గ్రీన్ ట్రైబ్యున‌ల్

న్యూఢిల్లీ – ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైన బీహార్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.నాలుగు వేల‌ కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ లో బీహార్ ప్రభుత్వం అలసత్వంపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీంతో ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల ఎన్విరాన్‌మెంటల్ సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని, ఈ ఖాతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధీనంలో ఉంటుందని, సీఎస్ ఆదేశాల మేరకు ఈ ఖాతాలోని మొత్తాన్ని వేస్ట్ మేనేజ్ మెంట్ కు మాత్రమే వినియోగించాలని గ్రీన్ ట్రైబ్యునల్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement