Friday, October 18, 2024

TG | తహసీల్దార్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌…

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాలకు తిరిగివెళ్లేలా అవకాశం కల్పిచాలని తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌(టీజీటీఏ) మొదటి నుంచి చేస్తున్న కృషి ఫలించింది.

ఇప్పటికే ఇదే విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌లను టీజీటీఏ పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సమయంలోనూ ఇదే విషయాన్ని టీజీటీఏ బలంగా చెప్పడంతో ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచన చేసి సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాల్సిందిగా తహశీల్దార్లకు అవకాశం ఇస్తూ సీసీఎల్‌ఏ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, మహిళా అధ్యక్షురాలు పి. రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్‌ పాక, సెక్రటరీ జనరల్‌ పూల్‌సింగ్‌ చౌహాన్‌ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement