Tuesday, November 26, 2024

అంతర్జాతీయ విమానాలకు గ్రీన్‌సిగ్నల్‌.. ఈ నెల 27 నుంచి టేకాఫ్‌కు..

సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీ విమానసర్వీసులపై భారత ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల నుంచి నిలి చిపోయిన అంతర్జాతీయ సర్వీసులు ఈనెల 27నుంచి అందుబాటులో ఉంటాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వ్యాక్సినేషన్‌ కవరేజీని గుర్తించిన తర్వా, వాటాదారులతో సంప్రదించిన మీదట సమ్మర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈనెల 27వ తేదీ నుంచి సమ్మర్‌షెడ్యూల్‌ 2022 ప్రారంభం అవుతుంది. తాజా ఆదేశాల మేరకు షెడ్యూల్‌ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు పునప్రారంభమవుతాయి. మహమ్మారి పరిస్థితు ల తర్వాత కొన్ని షరతులకు లోబడి ఏర్పాటైన బబుల్‌ విధానంలో వివిధ దేశాలు పరస్పరం సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపాయని, ఈ ప్రకారం 2020 జులై నుంచి భారతదేశం నుంచి 37 దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

బబుల్‌ ఏర్పాటు ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను, వాటి లాభదాయకతను దెబ్బతీసిందన్నారు. అంతర్జాతీయ కార్య కలాపాలు కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడానికి ఏవి యేషన్‌ వాచ్‌డాగ్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మొదటి సారిగా 2020 మార్చిలో విమాన సర్వీసుల కార్యకలాపాలను నిలిపివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement