Tuesday, January 14, 2025

Nizamabad | సంక్రాంతి కానుక.. పసుపు బోర్డు వచ్చింది !

  • పండుగ వేళ పసుపు బోర్డు ప్రారంభోత్సవం..
  • చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి

తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న పసుపు బోర్డు కల సాకారమైంది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటులో కీలక అడుగు పడింది.

సంక్రాంతి కానుకగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప‌సుపు బోర్డుకు పల్లె గంగారెడ్డిని చైర్మన్‌గా ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement