వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 5,348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సీవీని విడుదల చేశారు. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు నేరుగా ఈ పోస్టులను భర్తీ చేస్తుంది.
రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ పోస్టుల భర్తీకి ఇంకా అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. స్థానికత ఆధారంగా ఖాళీలు, రోస్టర్ మరియు అర్హత వివరాలతో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.