Thursday, September 19, 2024

AP | విద్యా శాఖలో ఏడీ పోస్టుల భర్తీ గ్రీన్‌ సిగ్నల్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: పాఠశాల విద్య శాఖలో 2024 – 25, 2025 – 26 విద్యా సంవత్సరాలకుగాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ప్ర భుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు గురువారం విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏడీ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషనల్‌ కమిటీని పునర్‌వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కమిటీలో సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్పీడీ), డిప్యూటీ సెక్రటరీ / జాయింట్‌ సెక్రటరీ / అడిషనల్‌ సెక్రటరీలను సభ్యులుగా చేర్చారు. ఏడీ పోస్టులకు అర్హత కలిగిన వారిని పరిగణలోకి తీసుకుని పదోన్నతులను కల్పించాలని కార్యదర్శి శశిధర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement