Thursday, November 21, 2024

బీహార్‌లో కులగణనకు గ్రీన్‌సిగ్నల్‌..

బీహార్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో సర్వేను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బీహార్‌ ప్రభుత్వం కులగణనను మొదలుపెట్టింది. మొదటి దశ సర్వే జనవరి 7-21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్‌ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సీజే కె.వినోద్‌ చంద్రన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి వాటిని కొట్టేసింది. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement