డెబిట్ కార్డు వివరాలను అందజేయ నవసరం లేకుండానే ఆధార్ ఆధారిత ఓటీపీతోనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీ ఐ) సేవలను పొందే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పించనున్నాయి. బ్యాంకులకు ఈమేరకు అనుమతి ఇస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. కాగా ఈ సేవలను ఎన్‌పీసీఐ తొలుత సెప్టెంబర్ 2021లో ప్రవేశపెట్టింది. డెబిట్‌కార్డులేని ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అయితే సంబంధిత బ్యాంకు తరఫున యూనిక్ ఐడెంటిఫి కేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎన్‌పీసీఐ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే పేమెంట్లు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. డెబిట్‌కార్డుకు బదులుగా ఆధార్ ఓటీపీని ఉపయోగించి యూపీఐపై లాగిన్ కావచ్చని ఎన్‌పీసీఐ తెలిపింది. వాస్తవానికి ఈ సౌకర్యాన్ని గతేడాది వినియోగంలోకి తెచ్చినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన టెక్నాలజీ సిద్ధంగా లేనందున కంప్లియన్స్ టైమ్ లైన్‌ను మార్చి 15కు పొడిగించినట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది. యూపీఎ అప్లికేషన్ ఏ మొబైల్‌లో వాడుతున్నారో ఆ మొబైల్‌లో ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్నప్పుడే సాధ్యమవుతుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.
ఈ మొబైల్ నంబర్ బ్యాంక్‌వద్ద కూడా రిజిస్టరై ఉండాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు డెబిట్ కార్డు వివరాలతోనే యూపీఐ సర్వీసులును యాక్టివేట్ చేసుకుని పేమేంట్లు చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 45కోట్లమంది లబ్ధిదారులకు బ్యాంకు ఖతాలు ఉన్నాయి. వీరిలో 30కోట్ల మంది గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తుండగా మిగిలిన వారు అర్బన్, మెట్రో ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. జన్ ధన్ యోజన లబ్ధిదారుల్లో 31.4కోట్ల మంది మాత్రమే రూపే డెబిట్ కార్డులను తీసుకున్నారు. ఈనేపథ్యంలో డెబిట్ కార్డులు లేనివారు యూపీఐ సర్వీసులు వినియోగించుకునేలా ఎన్‌పీసీఐ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..