ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలుకు మహారాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులను ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం మార డంతో ఇప్పుడు పలు ప్రాజెక్టులు స్పీడ్‌గా కదులుతు న్నాయి. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో బుల్లెట్ రైలు ఒకటి. జూన్ 30న షిండే, ఫడ్నవీస్‌లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతంగా చేయాలని నిర్ణయించింది. గత మహావికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభిం చడం ఆలస్యం చేసిందని, ఫైల్స్‌ను టేబుల్‌పై పెట్టుకుని కూర్చుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మార్పుతొ పాటు కొత్త ప్రభుత్వంతో ఇప్పుడు ప్రాజెక్టుకు ఊతం లభిస్తుందని రైల్వేమంత్రి భావిస్తున్నారు. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్‌లోని 12 స్టేషన్లు-సూరత్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి, బిలిమోరా, బరూచ్, ముంబై, థానే, విరార్, బోయినర్, వాపి స్టేషన్లగుండా నడుస్తుంది. కేవలం రెండు గంటల్లో దూరాన్ని చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే మొదటిది.
2026 నాటికి బుల్లెట్ రైతులు..
2026 నాటికి సూరత్, బిల్మోరా స్టేషన్ల మధ్య మొదటి బుల్లెట్ రైలు ప్రాంభమవుతుందని ఆశిస్తున్నట్లు రైల్వే మంత్రి ఒక కార్యక్రమంలో చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లోని 8 స్టేషన్లలో బుల్లెట్ రైలు పనులు పురోగతిలో ఉన్నాయి. 70 కి.మీ మార్గంలో పిల్లర్లు సిద్ధం చేశామన్నారు. అదే సమయంలో అహ్మదాబాద్ నుండి వాపి మధ్య 160 కి.మీ మార్గంలో పునాది పనులు జరిగాయి. మార్గం మధ్యలో వచ్చే ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణ పనులు కొనసా గుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉత్సాహం చూపలే దన్నారు. అయితే ఇప్పుడు గుజరాత్ లాగా మహారా ష్ట్రలో కూడా పనులు వేగవంతం అవుతాయని ఫడ్నవీస్ తెలిపారు.
బుల్లెట్ రైలు వేగం…
ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 350 కి.మీ డిజైన్ వేగంతో, గరిష్టంగా గంటకు 320 కి.మీ ఆపరేటింగ్ స్పీడ్‌ని కలిగి ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 2017లో అహ్మదాబాద్‌లోని సబర్మతి వద్ద రూ. 1.1 లక్షల కోట్ల ప్రాజెక్టుకు జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.
నిర్ణయం కాని ఛార్జీలు.
బుల్లెట్ రైలు ఛార్జీలను ఫస్ట్ క్లాసు ఏసీ రైలుతో సమానంగా ఉంచుతామని గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు. అయితే చార్జీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే చెల్లించే దానికంటే తక్కువ ధర ఉంటుందని, సౌకర్యాలు బాగుంటాయని వైష్ణవ్ తెలిపారు. చివరగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అసలు ఛార్జీలు నిర్ణయిస్తామని ఆయన స్పష్టంచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.