తెలంగాణలో గ్రీన్ కవర్ 7.8శాతంకు పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పోడు భూములంటే దురాక్రమణే అన్నారు. ఇప్పుడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామన్నారు. కానీ ఇదేవిధంగా కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. ముగింపు రావాలన్నారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు. అడవులన్నీ నరికివేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ప్రతి సారీ దీనిపై రాజకీయం చేయడం అలవాటై పోయిందన్నారు. గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్థిస్తున్నారన్నారు. అటవీ అధికారి శ్రీనివాసరావును చంపడం కరెక్టేనా అన్నారు. పోడు భూముల సమస్య న్యాయమైన డిమాండ్ కాదన్నారు.