గ్రీక్ తీరంలో ఫిషింగ్ బోటు బోల్తా పడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 100 మంది స్వల్స గాయాలతో బయటపడ్డారు. . పెలోపొన్నీస్ సముద్రంలో నేటి తెల్లవారు జామున వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడ్డారని, ఇందులో 17మంది గల్లంతు కాగా, మరో 100 మందిని రక్షించినట్టు గ్రీస్ కోస్ట్‌గార్డ్ ప్రకటించారు.
అయోనియన్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ప్రమాదం సంభవించింది. బలమైన గాలుల కారణంగా విస్తృతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించిందని కోస్ట్‌గార్డ్ తెలిపారు. నౌకాదళానికి చెందిన నౌకలతో పాటు ఆర్మీ విమానం , హెలికాప్టర్‌తో మరో ఆరు పడవలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి రక్షించిన వారిని కలమటకు తీసుకువస్తున్నారు, అయితే పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హెలికాప్టర్ ద్వారా పోర్టు ఆసుపత్రికి తరలించారు.