గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌ను తలపించే విధంగా 50 ఏళ్ల బృహత్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వరంగల్‌ను ఫ్లడ్ ఫ్రీ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. నగరానికి ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్డు విస్తరణలో తమ స్థలం కోల్పోయిన వారికి ఆరు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement