భారత్ కోసం మహా సంగ్రామం 2024లోనే జరుగుతుందని, ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినంత మాత్రాన.. మళ్లిd 2024 లోక్సభ ఎన్నికల్లో.. బీజేపీ గెలుస్తుందనేది మోడీ భ్రమ అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. ఈ నాలుగు రాష్ట్రాలు భవిష్యత్తును నిర్ణయించలేవన్నారు. 2024 సార్వత్రిక తీర్పును ప్రజలు 2022లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో వెల్లడించారని మోడీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. మోడీ చేసిన వ్యాఖ్యలు.. ప్రతిపక్షాలను ప్రజల్లో మరింత బలహీనం చేసే ఎత్తుగడే అని విమర్శించారు. 2024 ఎన్నికలు.. అదే ఏడాదిలో విజయాన్ని వెల్లడిస్తాయన్నారు.
ఈ విషయం సాహెబ్ (మోడీ)కి తెలుసు అన్నారు. కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పార్టీ వైపు అందర్నీ మళ్లించేందుకు ప్రధాని తెలివైన ఆలోచనా ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని, తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్టు పీకే తెలిపారు. లోక్ సభ ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఉండదని తేల్చి పారేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..