Tuesday, November 26, 2024

గ్రేట్ జాబ్‌.. ఉపాధి కూలీగా ప‌నిచేస్తూ… డాక్ట‌ర‌య్యాడు!

జైపూర్‌: రాజ‌స్థాన్ రాష్ట్రం బ‌ర్మ‌ర్ జిల్లా సింధ‌రి తాలూకా కంథాయి గ్రామానికి చెందిన దుధ్ర‌మ్ ఓ వైపు విద్యాభ్యాసం చేస్తూనే త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి కూలీ ప‌నుల‌కెళ్లేవాడు. ప్రాథ‌మిక విద్యాభ్యాసం నుంచే డాక్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంతో చ‌దివేవాడు., అన్ని త‌ర‌గ‌తుల్లో క్లాస్ ఫ‌స్ట్ వ‌చ్చేవాడు. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోయినా… కూలీ ప‌నుల‌కెళ్తూ క‌ష్ట‌ప‌డి చ‌దివాడు.

ఎన్‌ట్‌(యూజీ)2021లో 626 మార్కులతో 9375 ర్యాంకు సాధించాడు. ఆ గ్రామంలో దుధ్ర‌మ్ తొలి డాక్ట‌ర్ అని గ్రామ‌స్థులు తెలిపారు. దుధ్ర‌మ్ కుటుంబానికి గ్రామంలో 10-12 కుంట‌ల భూమి మాత్ర‌మే ఉంది. అది కూడా వ‌ర్షాధారిత పంట‌లు పండే పొల‌మ‌ని, ఏడాదికి ఒక పంట మాత్ర‌మే పండుతుంది. దుధ్ర‌మ్ త‌ల్లి లెహ్రో దేవి ఉపాధి కూలీ ప‌నులు చేస్తుండ‌గా, తండ్ర‌ది పూరారామ్‌, అన్న ఖీమ‌రాం కంథా భ‌వ‌న నిర్మాణ ప‌నులుకు వెళ్తున్నారు. అన్న ఖీమ‌రాం కంథా కోటా యూనివ‌ర్శిటీ నుంచి డీఏ ప‌ట్టా పొందారు. ఉద్యోగం రాక ఉపాధి ప‌నుల కూలీకి వెళ్తున్నాడు. క‌ష్ట‌ప‌డి చ‌దివితే ఏదైనా సాధ్య‌మ‌ని మ‌రోసారి నిరూపించాడు దుధ్ర‌మ్‌. నేటి విద్యార్థినీ విద్యార్థుల‌కు దుధ్ర‌మ్ ఓమార్గ‌ద‌ర్శిగా నిలిచాడ‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement