Tuesday, December 3, 2024

TG | ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.143 కోట్లతో 18 చెక్‌ డ్యాంలను నిర్మించడానికి నీటిపారుదల శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ చెక్‌ డ్యాంలను నిర్మించనున్నారు.

వీటి నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ హయాంలోనే నిధులు మంజూరు చేశారు. వివిధ కారణాలతో పనులు జరగలేదు. ఈ నేపథ్యంలో మరోసారి అంచనాలను సవరించి నిధులను మంజూరు చేశారు. వీటిని తుంగతుర్తి, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లో వీటిని నిర్మిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement