Thursday, November 21, 2024

దేశ రాజధానిలో ఘనంగా సురభి నాటకాలు.. ఆజాదీకా అమృత్​ ప్రోగ్రామ్​లో నిర్వహణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో 5 రోజుల పాటు జరిగిన సురభి నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో అభిమంచ్ ఆడిటోరియంలో సురభి నాటకాలను ఏర్పాటు చేసింది.

ఐదు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం గం. 6.30కు నాటక ప్రదర్శన జరిగింది. మొదటి రోజు ‘మాయాబజార్’, రెండో రోజు ‘భక్త ప్రహ్లాద’, మూడో రోజు ‘పాతాళ భైరవి’, 4వ రోజు ‘యశోద కృష్ణ’, చివరి రోజైన 5వ రోజు ‘శ్రీనివాస కళ్యాణం’ నాటకాలను ప్రదర్శించారు. చివరి రోజు కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘శ్రీనివాస కళ్యాణం’ నాటకాన్ని కిషన్ రెడ్డి రెడ్డితో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఆసక్తిగా తిలకించారు. ముగింపు కార్యక్రమంలో కళాకారులను కిషన్ రెడ్డి సన్మానించారు. మరుగునపడుతున్న సురభి నాటకాలకు ఊపిరిపోస్తూ దేశ రాజధానిలో ప్రదర్శించే అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినాయక నాట్య మండలి వ్యవస్థాపకులు వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement