Saturday, October 5, 2024

TG | సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం సాయంత్రం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను శనివారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనుసూయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement