గుంటూరు జిల్లాలో ఓ కామాంధుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. చుండూరు మండలం మున్నంగి వారిపాలెంలో మైనర్ బాలికపై వలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మైనర్ బాలికకు పవన్ అనే వలంటీర్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పవన్‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement