క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) సంఘం సౌతాఫ్రికా టీ20 లీగ్ పేరిట కొత్త టోర్నీ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త టీ20 లీగ్‌కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే సీఎస్ఏలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ (డీవోసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలనే లక్ష్యంతో టీ20 లీగ్‌కు శ్రీకారం చుట్టింది.
ఈ టోర్నీకి మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా, ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కైవసం చేసుకోవడం విశేషం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ పేరుతో ఉన్న ఫ్రాంచైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లిd క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ టీ20 లీగ్ నిర్వహించాలని సీఎస్ఏ యోచిస్తోంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.