Thursday, November 21, 2024

11కు వాయిదా పడ్డ జీఆర్​ఎంబీ భేటీ.. గెజిట్​ అమలు చేయాలని పట్టుబడుతున్న కేంద్రం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మార్చి 11వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి మార్చి నాలుగో తేదీన్నే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జల సౌదలోని జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు, ఇరిగేషన్‌ ఈఎన్సీలకు జీఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రెటరీ బీపీ పాండే సోమవారం లేఖ రాశారు. గోదావరి నదీపై ప్రాజెక్టుల నిర్వహణను బోర్డు కు అప్పగించాలని ఇరు రాష్ట్రాలను జీఆర్‌ఎంబీ కోరుతోంది.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గజిట్‌ను అమలు చేయాలని పట్టుబడుతోంది. అయితే గోదావరి నదీపై ఏపీ, తెలంగాణ మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున జీఆర్‌ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ తేల్చి చెబుతోంది. పూర్తిగా తెలంగాణ అవసరాలకే ఉద్దేశించి, డిజైన్‌ చేసిన ఆరు సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదించాలని బోర్డుతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. గోదావరి ప్రాజెక్టులపై సమర్పించిన డీపీఆర్‌లపై జీఆర్‌ఎంబీ కొర్రీలు పెట్టడాన్ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న జరగాల్సిన జీఆర్‌ ఎంబీ బోర్డు సమావేశం లో వాడీ వేడీ చర్చలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement