Friday, November 22, 2024

త్వరలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ

జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు వసూలుకు మరో 6 నెలల్లో జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల స్థానంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీని వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ప్రయాణించిన దూరానికే టోల్‌ ఫీజు వసూలు చేయడం వీలుకలుగుందని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతంం టోల్‌ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి ఏటా 40 వేల కోట్ల ఆదాయం వస్తోంది.

- Advertisement -

రానున్న మూడు సంవత్సరాల్లో ఈ మొత్తం 1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని గడ్కరీ తె లిపారు. వాహనం ఆగకుండానే నంబర్‌ ప్లేట్‌ను రీడ్‌ చేసే ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రవాణా శాఖ పని చేస్తోంది. 2018-19 నాటికి టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిముషాల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చిన తరువాత ఈ సమయం సగటున 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ వివరించారు. రద్దీ సమయాల్లో మాత్రం ఈ సమయం ఎక్కువగా ఉంటోంది.

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల గుర్తించిన లిథియం నిల్వలను సమర్ధవంతగా వినియోగించుకుంటే భారత్‌ ఆటోమొబైల్‌ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని గడ్కరీ చెప్పారు. ఏటా 1200 టన్నుల లిథియంను మన దేశం దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. 2022లో జపాన్‌ను దాటి మన దేశం మూడో అతి పెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా అవతరించిందన్నారు. భవిష్యత్‌లో ప్రజా రవాణానున, విద్యుత్‌ బస్సులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement