Tuesday, November 26, 2024

జీపీఎఫ్‌ డబ్బులు కాజేసీ ఉద్యోగులను మోసగించారు.. 800 కోట్లు ఎటు మళ్లించారో చెప్పాలి : జ‌న‌సేన‌

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్‌ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్‌ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ ఈ ప్రభుత్వం మాసిపూసి మారేడుకాయ చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ. 800 కోట్లు- సొమ్మును ప్రభుత్వం మళ్లించిందని, ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమేనని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జీపీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటు-ందని, ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్‌ మాత్రమేనని, అలాంటిది కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలాగని నాదెండ్ల ప్రశ్నించారు. వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచుతున్న వైసీపీ ప్రభుత్వం- ఆ ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకొంటోందంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు కరవు భత్యం పీఎఫ్‌ ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా మోసం చేయడమేనన్నారు. అలాగే రి-టైర్‌ అయిన ఉద్యోగులకు కూడా రావాల్సిన బెనిఫిట్స్‌ కూడా ఇవ్వకుండా నిలుపుదల చేస్తోందని, రూ. 800 కోట్లను ఎటు- మళ్లించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement