Friday, November 22, 2024

India | 1.48లక్షల కోట్లు కావాలే, పార్లమెంట్​ అనుమతి కోరిన కేంద్ర ప్రభుత్వం

ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి గ్రాంట్ల కింద ఖర్చు చేయడానికి గాను.. 1.48లక్షల కోట్లు కావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​ అనుమతి కోరింది. ఈ మేరకు పలు అంశాలపై ఖర్చుచేయాల్సిన వివరాలకు సంబంధించిన నోట్​ని పార్లమెంట్​ ముందుకు తీసుకొచ్చింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

2022–23వ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి గాను 1.48లక్షల కోట్ల అదనపు వ్యయం కోసం గ్రాంట్లు మంజూరు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల (సోమవారం) పార్లమెంట్​ ఆమోదాన్ని కోరింది. ఈ మిగిలిన కాలానికి రూ. 1,48,133 కోట్ల అదనపు వ్యయం కోసం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్లు, అనుబంధ డిమాండ్లు.. రెండో బ్యాచ్ కింద అందజేయాలని కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. 

ఈ క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రాంట్ల (రెండో బ్యాచ్) కోసం అనుబంధ డిమాండ్లను చూపే ప్రకటన సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మొత్తంలో రక్షణ పెన్షన్లు, రాష్ట్రాలకు GST పరిహారం, ఎరువులు, యూరియా రాయితీలు, సావరిన్ గ్రీన్ ఫండ్.. టెలికాం మంత్రిత్వ శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (USO) నిధికి ప్రధానంగా నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో ముఖ్యమైనవి ఏమిటంటే..

- Advertisement -
  • ఎరువుల సబ్సిడీపై రూ.21,000 కోట్లు
  • యూరియా సబ్సిడీపై రూ.15,325 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
  • రక్షణ పెన్షన్ల కోసం కేంద్ర రూ.33,718 కోట్లు ఖర్చు చేయనుంది.
  • రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించడానికి రూ.29,616 కోట్లు వెచ్చించాల్సి ఉంది.
  • టెలికాం మంత్రిత్వ శాఖకు USO ఫండ్ కింద 25,052 కోట్లను ఖర్చు చేయనుంది.  
  • సావరిన్ గ్రీన్ ఫండ్‌పై రూ.5,536 కోట్లు ఖర్చు చేయనుంది.
  • మాజీ సైనికుల ఆరోగ్య పథకం, అగ్నిపథ్, ఇతర ఖర్చుల కోసం 3,960 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్రం వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement