Wednesday, November 20, 2024

టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

కొవిడ్‌-19 మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం ప్రోత్స#హంచిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల కారణంగా గతేడాది ఇద్దరు బాలికలు మరణం పట్ల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఇది విషాదకరమైనా.. ప్రభుత్వం మరణాలకు బాధ్యత వహించదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అర్హులైన వ్యక్తులు టీకా వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని, అయితే దానికి ఎలాంటి చట్టపరమైన బలవంతం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది.

అయితే, ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగస్టు 29న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. శప పరీక్ష, విచారణ నివేదికలను సమయానుకూలంగా విడుదల చేయడంతో పాటు మరణంపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు దాఖలైంది. మృతుల తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అయితే నష్ట పరిహారం డిమాండ్‌ను ఆరోగ్యమంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్‌ కోర్టులో దావా వేయొచ్చని. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement