Thursday, September 12, 2024

TG | కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అర్హులైన వారందరికీ న్యూ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

కొత్త రేషన్ కార్డులు వీరికి మాత్రమే..

రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement