Sunday, November 24, 2024

TG | ప్రభుత్వానికి హైకోర్టులో ఊర‌ట‌.. విద్యుత్ బిడ్‌లో పాల్గొనేందుకు అనుమ‌తి

బీఆర్‌ఎస్‌ హయాంలో చత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నేషనల్ నోడ్ డిస్పాచ్ సెంటర్ తెలంగాణ డిస్కమ్‌లను విద్యుత్ బిడ్‌లలో పాల్గొనకుండా నిషేధించింది. రూ.261 కోట్ల బకాయిలు చెల్లించాలని పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది.

విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో.. ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ రోనాల్డ్ రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కోసం వేలం వేసేందుకు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది. దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement